తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాకరంగా తీసుకొచ్చిన టీ హబ్ ఇప్పుడు మరో ముందడుగు వేసింది. భారత ప్రభుత్వ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్లో భాగస్వామి అయింది. కేంద్ర ప్రభుత్వం వారి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఈఐటీవై)తో ఒప్పందం కదుర్చుకుంది.
ఏమిటీ ఒప్పందం?
ఇండియాలో హార్డ్వేర్, ఐఓటీ రంగంలోని స్టార్ట్ప్లను డిజిటల్ ఇండియా కింద ప్రోత్సహిస్తున్నారు. దానిలో ఇప్పుడు టీ హబ్ కూడా పార్టనర్గా చేరింది. ఇందుకు అనుగుణంగానే డిజిటల్ ఇండియా, ఎలక్ట్రానిక్స్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కార్యక్రమం కింద ఎంపికైన హార్డ్వేర్, ఐవోటీ స్టార్టప్లను టీహబ్ లీడ్ చేయబోతోంది. ఇండియా మొత్తం మీద ఈ కార్యక్రమం కింద స్టార్టప్లు అప్లయి చేసుకోవచ్చు.
ఏయే రంగాల్లో అంటే
మొబిలీటి, ఎనర్జీ, అగ్రికల్చర్, ఏరోస్పేస్, మాన్యుఫాక్చరింగ్, కన్స్యూమర్, హెల్త్టెక్, మెడిటెక్ రంగాల్లో స్టార్టప్లు తమ ఉత్పత్తులను తయారుచేయడానికి వీలుగా ప్రాజెక్టులు రూపొందించాల్సి ఉంటుంది.
* స్మార్ట్ సిటీస్కు కావల్సిన హార్డ్వేర్, ఐవోటీ ప్రాజెక్టులు కూడా ఈ నెలలో అప్లయి చేసుకోవచ్చు.
* వచ్చిన అప్లికేషన్స్ను పరిశీలించి 10 నుంచి 15 స్టార్టప్లను సెలెక్ట్ చేసి టీ హబ్ వాటికి మార్గదర్శనం చేస్తుంది.
టీహ‌బà±â€Œ టీహ‌బౠడిజిట‌లౠఇండియా t hub  t hub digital india partnership